Posts

Showing posts with the label http://anirudhsite.blogspot.in/p/movies.html

N.T.R in Europe

Image
యూరప్ లో పదిహేను రోజులు____N.T.R ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. షూటింగ్ కోసం కాదు. ఆయన ఫామిలీతో సరదాగా గడపటానికి యూరోప్ వెళ్లారు. "జై లవ కుశ" చిత్రం తర్వాత ఆయన రెండు చిత్రాల్లో నటించడానికి ఒప్పుకున్నారు అందులో ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటించే మల్టీ స్టారర్ చిత్రం. అయితే ఈ రెండు చిత్రాలు వచ్చే సంవత్సరం ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో ఫిజిక్ పరంగా, లుక్ పరంగా కొత్తగా కన్పించడం కోసం ఎన్టీఆర్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే రెండు కలిసొస్తాయని యూరోప్ ట్రిప్ పెట్టుకున్నాడు. నిజానికి ఈ ట్రిప్ ఎప్పుడో ప్రారంభంకావల్సింది కానీ కొడుకు అభయ్ కు వీసా రాకపోవడంతో ట్రిప్ వాయిదా పడింది. ఆ సమస్య ఈ మద్యే పరిష్కారమవడంతో భార్య ప్రణతి, తనయుడు అభయ్ రామ్తో కలిసి యూరప్ వెళ్లారు. షూటింగ్ టెంక్షన్స్ లేకపోవడంతో మరో వారం రోజులు అక్కడే ఫామిలీతో సంతోషంగా ఉన్నారు.